రాష్ట్ర వ్తాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 23వ రోజు




అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆందోళనలు చేపట్టారు. అంగన్వాడీలు సమ్మెకు ఉభయ గోదావరి జిల్లాల  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ.వి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఐ. వి మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్లు
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చినప్పుడు గుర్తులేవా జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో అంగన్వాడి న్యాయమైన డిమాండ్లు అమలు చేయకపోతే నిన్ను గద్దెదింపేది అంగన్వాడి వర్కర్లే అని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజా సంఘాలు నాయకురాలు, మరియు అంగన్వాడీలు వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.