నూకాలమ్మ ఆలయంలో "అనన్య" చిత్రంలోని ఫస్ట్ సాంగ్ రిలీజ్



జంగారెడ్డిగూడెం: సినిమాల్లో చిన్న పెద్ద అని విభజన తగదని, ప్రేక్షకులను మెప్పించి నిర్మాతకు నాలుగు రూపాయిలు తేచ్చిపెట్టే ప్రతి సినిమా గొప్ప సినిమాయేనని ప్రముఖ సినీ నిర్మాత, ఎగ్జిబిటర్
కరాటం రాంబాబు అన్నారు. 

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిసరాల్లో సిద్దిధాత్రి మూవీ క్రియేషన్స్ బేనర్ పై బి. ప్రసాద్ రాజు దర్శకుడుగా నిర్మాణం జరుపుకున్న "అనన్య" చిత్రంలోని తోలి పాట రిలీజ్ వేడుక జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ వారి ఆలయంలో నూతన సంవత్సరం పురష్కరించుకుని సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది.

ముఖ్య ఆతిధిగా పాల్గోన్న కరాటం రాంబాబు మాట్లాడుతూ "అనన్య" చిత్రం భయంకర సన్నివేసాలతో నిర్మించిన సినిమా అయినప్పటికీ ఈ సినిమా కుటుంబంలోని సభ్యులంతా చూడదగిన చిత్రమని అన్నారు. 
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి జంగారెడ్డిగూడెం జెడ్పిటిసి సభ్యులు పోల్నాటి బాబ్జి మాట్లాడుతూ మన ప్రాంతంలో సినిమాలు నిర్మాణం చేయడానికి అన్ని సౌకర్యాలు, ప్రదేశాలు కల్గి ఉన్న ప్రాంతమని అన్నారు.

"అనన్య" చిత్రంలోని (నాపేరే జాస్మిన్..నే తింటా కొరమీను..) అను ఐటమ్ సాంగ్ ను జెడ్పిటిసి సభ్యులు పోల్నాటి బాబ్జి, ఆలయ కమిటీ చైర్మన్ రాజాన పండు, వ్యాపార వేత్త Texo శ్రీరాములు రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ గా పని చేసిన ప్రసాద్ రాజు మాట్లాడుతూ "అనన్య" చిత్రంలోని సన్నివేశలు గురించి తెలిపారు. చిత్రం చాలా బాగా వచ్చిందని, ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని చెప్పారు. కుటుంబ పరివారంతో చూసి.. ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని, సెన్సార్ కు సిద్ధంగా ఉందని, వచ్చే నెల ఫిబ్రవరిలో థియేటర్ లో విడుదల చేయునున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత జంధ్యాల గంగాధరశర్మ, సహానిర్మాత బుద్దాల సత్యనారాయణ, మరో నిర్మాత సింగం శెట్టి సత్యనారాయణ, తిరుమలాపురం సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కనుపర్తి వేణు మాధవ్, షేక్ లాల్, హీరో పాత్రలో నటించిన జై రామన్ జుత్తిగ, విలన్ పాత్రలో నటించిన రాజేష్ మరి కొందరు నటీనటులు హాజరయ్యారు. ఈ రీలేజ్ కార్యక్రమం పముఖ సీనియర్ పాత్రికేయులు పి ఆర్ ఓ కె ఎస్ శంకరరావు అధ్యక్షతన జరిగింది.