డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ముమ్మిడివరం మండలం అన్నంపల్లి గ్రామానికి చెందిన గుర్రాల వీరరాఘవులు కుమార్తె గుర్రాల పుష్ప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అమలాపురంలో హరి మనో వికాస కేంద్రం మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల సంస్థలో 30 మంది దివ్యాంగులకు జన కళ్యాణ్ సంస్థ ఆధ్వర్యంలో గుర్రాల పుష్ప దివ్యాంగులకు సమకూర్చిన 30 దుప్పట్లు, 25 కేజీలు రైస్ కట్ట, పళ్ళు, సబ్బులు, బిస్కెట్లు, కాల్ గెట్ పేస్టు, డ్రింక్స్, రిన్ పౌడర్స్ ప్యాకెట్స్ మొదలగునవి దివ్యాంగుల పిల్లలకు వితరణ చేయడం జరిగింది,
ముందుగా అన్నంపల్లి నుండి వచ్చిన పాస్టర్ ఏసన్న ప్రార్థన చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. ఇటువంటి కార్యక్రమాలు దివ్యాంగులకు ఇవ్వడం చాలా మంచి కార్యక్రమాన్ని ఇటువంటి మంచి మనసు కలిగిన పుష్పకు అభినందనలు తెలియజేశారు. జన కళ్యాణ్ సంస్థ మేనేజర్ జి శ్రీను ఇటువంటి దివ్యాంగుల పిల్లలకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వారికి సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు. జనా కళ్యాణ్ సంస్థలో ముందుగా కేక్ కటింగ్ చేసి తరువాత అమలాపురం హరి మనో వికాస్ కేంద్రం మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో పుష్ప పుట్టినరోజు భారీ కేక్ కట్ చేసి దివ్యాంగుల సమక్షంలో పుట్టినరోజు ఘనంగా జరిపారు.
ఈ కార్యక్రమంలో అమలాపురం సామాజిక సేవకురాలు జల్లి సుజాత, గొల్లపల్లి గోపి, ఏఎన్ఎం రమణి, శాంతి, గుర్రాల అమల, రూపా రాణి, ప్రణవి, భవాని, సత్యనారాయణ, మనిషా మొదలగు వారు పాల్గొన్నారు.
Rambabu R
Repoter
BCN TV
Katrenikona
Katrenikona
Konaseema District