దైవ సేవకులకు వస్త్రాలు బహుకరించిన గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్


వై.యస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు తూ౹౹ గో౹౹జిల్లా పంచాయతీ పరిషత్ చైర్మన్ ఉదయ్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఈరోజు అనేకమంది దైవజనులకు వస్త్రాలు బహుకరించారు.

ఈ సదర్భంగా అమలాపురం యుపిఎఫ్ అధ్యక్షులు మాట్లాడుతూ
గుడ్ సీడ్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రమణరావు గారికి వందనాలు తెలియజేసారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో సేవకులకు సహకారం అందిస్తూ అనేక మంది పేద విద్యార్థి విద్యార్థులు చదువులకు సహకరిస్తూ ఉన్న మంచి హృదయం కలిగిన వారిని యూ.పి.యఫ్. అధ్యక్షులు పాస్టర్ మొసలి స్పర్జన్ రాజు తెలియజేశారు. దైవజనులను ప్రోత్సహించే వారు కూడా కావాలి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ కార్ల్. డేవిడ్ కొమానపల్లి మాట్లాడుతూ గుడ్ సీడ్ ఫౌండేషన్ ద్వారా రమణారావుగారు దైవ సేవకులైన వారందరికీ ఈ యొక్క వస్త్రాలు బహకరించాలని ఉద్దేశంతో ఈ పనిని తలపెట్టి అనేక మండలాల్లో వారు ఈ యొక్క వస్తాలు దైవజనులకు బహుకరించడం జరిగింది. దేవుడు ఇంకా వారిని దీవించి ఆశీర్వదించి వారు చేయుచున్న పనుల్లో, వ్యాపారాల్లో, ప్రజా సేవలో, ఆదర్శంగా ఉంటూ ప్రజలు మెచ్చే విధంగా దేవునికి మహిమ తెచ్చే విధంగా వారి యొక్క సేవలు వ్యాపారాలు సంస్థలు ముందుకు సాగాలని కోరుతూ. పాస్టర్ల అందరికీ ఇవ్వాలని తలపెట్టిన ఈ పని అంతటిని బట్టి వారికి వందనాలు తెలియజెస్తున్నాను. దైవ సేవకులు, అనేక మంది అలాగే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం, దైవ సేవకులు మందిర నిర్మాణం చేసుకున్నప్పుడు మెటీరియల్ ఇవ్వడం, ఇంకా పేద ప్రజలు లేక బిడ్డలు చదువులు విషయాల్లో వారు సహకరిస్తున్న విధానాన్ని బట్టి చాలా సంతోషం, ప్రభుత్వ పథకాలు చాలా వచ్చేసాయి ఈ యొక్క దినాల్లో విరివిగా ఉన్నాయి. 

అవి సద్వినియోగం చేసుకోండి. బిడ్డలు చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది. పేదరికం ఇదివరకు ఉన్నట్లు లేదు అందరూ అభివృద్ధి అవ్వడానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు ఉన్నతమైన చదువులు చదువుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకను ప్రభుత్వాలు ద్వారా, సేవా సంస్థల ద్వారా మంచి జరగాలని గుడ్ సీడ్ ఫౌండేషన్, ఉదయ్ Actress ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్స్ అన్ని  దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాను.

కుంచె రమణా రావు ప్రతినిధిగా వారి టీం నుండి ప్రసాద్ మాట్లాడుతూ కుంచె రమణారావు చల్లపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ రోజున ఆయన సంపాదనలో పేదలకి 70% ధనాన్ని ఫైర్ యాక్సిడెంట్ కి, పేదలకు సహాయం చేయటానికి వాడుతున్నారు . అసలు గుడ్ సీడ్ ఫౌండేషన్ పేరు ఎందుకు పెట్టారంటే పేదలైన వారందరికీ సహాయపడాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది.  క్రైస్తవ సమాజానికీ మేలు చేయాలని పాస్టర్లకు గాని అందులో భాగంగానే ఈ వస్త్రాలు ఇంకా చర్చి నిర్మాణాలు మెటీరియల్ అందజేయడం, క్రైస్తవ రాజ్యవాప్తికి ఆయన కృషి చేస్తున్నారు. 

ఈ సందర్భంగా అనేకమంది పాస్టర్లకు వస్త్రాలు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా  యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ కార్ల్. డేవిడ్ కొమానపల్లి, సెక్రటరీ యం. యెహోషువ, యూ.పీ.ఎఫ్ అధ్యక్షులు యం. స్వర్జన్ రాజు,  సెక్రటరీ ఆనందరావు, వైస్ ప్రెసిడెంట్ నోబెల్ రాయ్, జాన్ వెస్లీ కృపావరం, జిల్లా, జోన్, మండల నాయకులు అనేకమంది దైవ సేవకులు మరియు గుడ్ సీడ్ ఫౌండేషన్ సభ్యులు గంట లక్ష్మి ప్రసాద్, పరమట రాజేష్, కుంచె అర్జున్, బల్ల చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు.

సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన రమణారావు

సి ఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అమలాపురం నియోజకవర్గం వైఎస్సార్ సిపి సీనియర్ నాయకుడు,గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు

అమలాపురం నియోజకవర్గం వైఎస్సార్ సిపి సీనియర్ నాయకుడు, గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు సి ఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంచిన సందర్భంగా బుధవారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమానికి వచ్చిన సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తాను వైఎస్సార్ పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఇప్పటివరకు పార్టీకి చేస్తున్న సేవలను రమణారావు వివరించారు. స్పందించిన సిఎం జగన్మోహన్ రెడ్డి పార్టీకి చేసిన సేవలకు తప్పక గుర్తింపు ఉంటుందని అలాగే కొనసాగించాలని సిఎం జగన్మోహన్ రెడ్డి రమణారావుకు సూచించారు.

Staff Repoter
Naresh. T
Dr BRA Konaseema District