ఎస్సై వెంకటరమణ పై కుట్ర పూరిత ఎసిబి దాడులను ఖండించిన రావులపాలెం ప్రెస్ క్లబ్



డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం: రావులపాలెం ఎస్సై ఎం.వెంకట రమణ, కానిస్టేబుల్ ప్రసాద్ లపై ఎసిబి అధికారులు దాడి వెనుక కొంతమంది స్వార్థ పరులు కుట్రతో ప్రణాళిక ప్రకారం వారిని పట్టించారని రావులపాలెం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు అన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ.. ఎస్సై వెంకటరమణ కానిస్టేబుల్ ప్రసాద్ లకు జరిగినది అన్యాయమని అన్నారు. 

రావులపాలెంలో ఎంతోమంది ఎస్సైలు సీఐలు వచ్చారు వచ్చిన వారందరూ ఆస్తులు సంపాదించారు డబ్బు సంపాదించారు కానీ ఏది ఆశపడకుండా అందరికీ సమన న్యాయం చేసి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతున్న ఎస్సై వెంకట్ రమణ మీద ఇటువంటి నిందలు వేయడం చాలా బాధాకరం అని అన్నారు. ఎస్సై వెంకటరమణపై కుట్రపూరిత అవినీతి కేసును ఖండిస్తూ.. వారికి సంఘీభావంగా స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్ళి ఇంఛార్జి ఎస్సై ప్రేమ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఎస్సై వెంకటరమణకు న్యాయం చేయాలని విలేకరుల యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.