బి సి ఎన్ న్యూస్ రావులపాలెం
డా.బి.అర్. అంబేద్కర్ కోనసీమజిల్లా రావులపాలెం గ్రామం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గ జే ఏ సీ ఆద్వర్యంలో జరిగిన క్రైస్తవ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ప్రజలకు దైవజనులు అందుబాటులో వుంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని సక్రమ మార్గంలో నడిపించే శక్తి దైవజనులకు వుందని అన్నారు.
ఆప్రభువు ఆశీస్సులు, మీఆశీస్సులు నాకందించి దీవించినట్లయితే మరిన్నీ సేవలు అందించి, ఒక సేవకునిగా ఎంతవరకు సేవ చేయగలనో అంతవరకు చేస్తానని అన్నారు.
ప్రపంచ శాంతి కోసం సిలువ త్యాగం చేసిన ఏసుక్రీస్తు బోధనలు ప్రకటించే దైవజనులతో కలసి సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ జే ఏ సీ కమిటీలో ఉండే అందరితోనూ ఎన్నో ఏళ్లగా పరిచయాలు ఉన్నాయని అన్నారు.ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటానని సత్యానందరావు తెలిపారు.