అమలాపురం: విద్యకున్న విలువలను గుర్తించి విద్యావ్యాప్తికి కృషి చేస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న రమణారావు సేవలు పలువురికి ప్రోత్సాహనీయమని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు.
అమలాపురం నియోజకవర్గంలోని అమలాపురం, అమలాపురం రూరల్,అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలకు సిద్ధపడుతున్న 3 వేలకు పైగా విద్యార్థులకు యు టి ఎఫ్ ముద్రించిన స్టడి మెటీరియల్ పుస్తకాలను అమలాపురం నియోజకవర్గం వైసిపి నాయకుడు, గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు ఆర్థిక సాయంతో విద్యార్థులకు సమకూర్చారు.
ఈ సందర్భంగా గురువారం అమలాపురం మున్సిపల్ జెడ్పి బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం,వి.విజయ కుమారి అధ్యక్షతన శుక్రవారం యుటిఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, రమణారావు లు స్టడి మెటీరియల్ పుస్తకాలను విద్యార్థులకు అందజేసి పట్టుదలతో చదివి ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ రమణారావు ముందుకు వచ్చి ఆర్థికంగా సాయం అందజేసి ఆదుకోవడం అభినందనీయ విషయం అన్నారు.
అలాగే పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం విద్యావ్యాప్తి కోసం రమణారావు తనకున్న దానిలో ఖర్చు చేసి అందిస్తున్న సహాయ సహకారాలు పలువురికి ఆదర్శనీయమన్నారు.ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రమణారావు లాంటి వ్యక్తి రానున్న రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టి పేద ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. కోవిడ్ సమయంలో లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది పేద వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి లక్షలాది రూపాయలు వెచ్చించి బియ్యం, నిత్యావసర సరుకులు, కాయగూరలు, భోజనాలు, శానిటైజర్ లు, పిపిఈ కిట్లు, మాస్కులు, మందులు అందించి ఆదుకున్న ఘనత రమణారావు కు దక్కుతుందని అన్నారు.
E సందర్భంగా రమణారావు మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంను తాను గట్టిగా నమ్మిన వ్యక్తినని అందుకే విద్యా వ్యాప్తికి విద్యార్థుల ఉన్నతకి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. పుస్తకాలను సమకూర్చిన రమణారావు ను యుటిఎఫ్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటివి సుబ్బారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, విద్యాశాఖ అధికారులు జి. సూర్య ప్రకాశం,కె. కిరణ్ బాబు.జి హెచ్ఎం,డి.నాగ సత్యనారాయణ, కోనసీమ జిల్లా కౌన్సిలర్ చంద్రకళ, యూటిఎఫ్ నాయకులు జి.సుబ్రహ్మణ్యం, ఎ.హెచ్,చంద్రసూర్యం, కె ఎన్ వి గౌడ్, కె.సత్యనారయణ తదితరులు దుశ్శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
Staff Repoter
Naresh. T
Dr BRA Konaseema District